కేసీఆర్ సభను విజయవంతం చెయ్యండి: ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు
ABN , First Publish Date - 2020-11-26T23:04:08+05:30 IST
ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను హైదరాబాద్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయ్యాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ ప్రజలకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి
లండన్: ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను హైదరాబాద్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయ్యాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి చేశారు. మన ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సభకు వస్తున్నారు కనుక హైదరాబాద్ గల్లీ గల్లీ నుండి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మరోసారి మన ఐక్యతను ఢిల్లీ నాయకులకు చూపించాలని అశోక్ గౌడ్ కోరారు.