మూడు నెలల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2020-06-25T07:53:27+05:30 IST

వారాంతంలో సరదాగా సినిమాకు వెళ్లే సంప్రదాయం భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా ఉంది. కరోనా ప్రపంచ దేశాలపై విరుచుకుపడటంతో.. దేశాలన్నీ లాక్‌డౌన్‌ను అ

మూడు నెలల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ఎక్కడంటే..!

న్యూఢిల్లీ: వారాంతంలో సరదాగా సినిమాకు వెళ్లే సంప్రదాయం భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా ఉంది. కరోనా ప్రపంచ దేశాలపై విరుచుకుపడటంతో.. దేశాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో సినిమా ప్రియులు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంను ఆశ్రయించారు. అయినా సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కాగా.. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేశాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ కూడా లాక్‌డౌన్ నిబంధనలను సడలించింది. దీంతో మూడు నెలల తర్వాత సోమవారం రోజు ఫ్రాన్స్‌లో థియేటర్లు తెరుచుకుని, వీక్షలకు ఆనందాన్ని పంచాయి. కరోనా నేపథ్యంలో ప్రజలు బయపడి థియేటర్లకు ఎవరూ వెళ్లలేదేమో అనుకుంటే.. మీరు పొరపాటు పడ్డట్లే. పెద్ద స్క్రీన్ మీద సినిమా చూసి.. కిక్కు పొందేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే మహమ్మారి విజృంభించకుండా.. థియేటర్ల యాజనామాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రతి ఇద్దరి మధ్య ఒక ఖాళీ సీటు ఉండేలా చర్యలు తీసుకున్నాయి. కొన్ని థియేటర్లలో అయితే ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా ఏకంగా బొమ్మలనే ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన వారు పక్క పక్కనే కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే.. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 1.61లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. దాదాపు 30వేల మంది మరణించారు. 


Updated Date - 2020-06-25T07:53:27+05:30 IST