క‌రోనా ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మైన‌ కీలక ఆధారం మాయం: క్వోక్‌

ABN , First Publish Date - 2020-07-28T13:38:18+05:30 IST

కరోనా పుట్టినిల్లు చైనాయేనా ? వైరస్‌ ప్రబలేందుకు కారణ‘భూతమైన’ ఆధారాన్ని డ్రాగన్‌ దేశమే లేకుండా చేసిందా ? ఈ ప్రశ్నలకు.. వూహాన్‌లో కొవిడ్‌-19 వ్యాపిస్తోందని జనవరిలోనే ప్రకటించిన చైనా వైద్యుడు క్వోక్‌ యుంగ్‌ యువెన్‌ ఔననే సమాధానమే చెబుతున్నారు.

క‌రోనా ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మైన‌ కీలక ఆధారం మాయం: క్వోక్‌

మేం వెళ్లేసరికే.. ‘కరోనా’ సాక్ష్యం మాయం!

చైనా శాస్త్రవేత్తల దర్యాప్తు బృందం సారథి క్వోక్‌  

బీజింగ్‌, జూలై 27: కరోనా పుట్టినిల్లు చైనాయేనా ? వైరస్‌ ప్రబలేందుకు కారణ‘భూతమైన’ ఆధారాన్ని డ్రాగన్‌ దేశమే లేకుండా చేసిందా ? ఈ ప్రశ్నలకు.. వూహాన్‌లో కొవిడ్‌-19 వ్యాపిస్తోందని జనవరిలోనే ప్రకటించిన చైనా వైద్యుడు క్వోక్‌ యుంగ్‌ యువెన్‌ ఔననే సమాధానమే చెబుతున్నారు. కొవిడ్‌ పుట్టినిల్లు వూహాన్‌ నగరంలోని హ్వానాన్‌ వన్యప్రాణి మార్కెట్‌లో దర్యాప్తు జరిపేందుకు జనవరి 17న వెళ్లిన చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ శాస్త్రవేత్తల బృందానికి ఆయనే నేతృత్వం వహించారు. తాము మార్కెట్‌కు వెళ్లేసరికి అక్కడి పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయని, స్థానిక అధికారులే ఖాళీ చేయించారని విచారణలో తెలిసిందని యువెన్‌ వెల్లడించారు. దీంతో ఇన్ఫెక్షన్‌ మనుషులకు ప్రబలడానికి కారణ‘భూతమైన’ కీలక ఆధారాన్ని గుర్తించే వీలు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-28T13:38:18+05:30 IST