వీడియో: ఈ ఆకాశ గొడుగులు ఎక్కడివి? భూమిపై ఎక్కడ దిగాయి ?

ABN , First Publish Date - 2020-05-10T09:19:31+05:30 IST

అంతరిక్షంలో శాశ్వత స్పేస్ స్టేషన్ ఏర్పాటుచేయడానికి, చంద్రుడిపైకి మానవులను

వీడియో: ఈ ఆకాశ గొడుగులు ఎక్కడివి?  భూమిపై ఎక్కడ దిగాయి ?

బీజింగ్: అంతరిక్షంలో శాశ్వత స్పేస్ స్టేషన్ ఏర్పాటుచేయడానికి, చంద్రుడిపైకి మానవులను పంపేందుకు ఉద్దేశించిన ప్రయోగం విజయవంతమైంది. మన పొరుగు దేశం చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నింగిలోకి ప్రయోగాత్మకంగా పంపిన అంతరిక్ష నౌక విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రయోగాత్మక స్పేస్ క్రాఫ్ట్ కావడంతో ఇందులో సిబ్బంది లేరు. ముందుగా నిర్దేశించిన సైట్‌కు ఈ అంతరిక్ష నౌక చేరుకున్నట్టు చైనా మ్యాండ్స్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ట్రైల్ వెర్షన్ అయిన రిటర్న్ క్యాప్‌సూల్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని డాంఫెంగ్ ల్యాండ్‌లోని సైట్‌కు విజయవంతంగా వచ్చిందని చైనా మ్యాండ్స్ స్పేస్ ఏజెన్సీ(సీఎమ్‌ఎస్ఏ) తెలిపింది. అంతరిక్ష నౌక క్యాబిన్ నిర్మాణం ఏ మాత్రం చెక్కుచెదరలేదని ప్రకటించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో.. ప్రాజెక్ట్ టీం ఆనందంలో మునిగిపోయింది. అంతరిక్ష కక్షలో ఈ వాహన నౌక 2 రోజుల 19 గంటలు ఉందని, అనేక పరిశోధనలు పూర్తి చేసిందని స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. అంతరిక్ష నౌకలు తిరిగి భూ వాతావరణానికి ప్రవేశించే సమయంలో అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవలసి ఉంటుందని, అయితే నౌక తిరిగి రావడం ద్వారా ఉష్ణ నిరోధకత సామర్థ్యాలను కూడా ధ్రువీకరించిందని వివరించింది. చైనా సెంట్రల్ టెలివిజన్‌తో అనుసంధానించిన ఫుటేజీలు ఈ ప్రక్రియను రికార్డ్ చేశాయి. 2022 నాటికి చైనా పూర్తి చేయాలనుకుంటున్న స్పేస్ స్టేషన్‌కు స్పేస్ షిప్ ఏదో ఒకరోజు వ్యోమగాములను మోసుకెళ్తుందని ఈ ఏజెన్సీ భావిస్తోంది. అలాగే చంద్రుడిపైకి మానవులను చేర్చాలన్నది ఈ మిషన్ లక్ష్యం. స్పేస్‌క్రాఫ్ట్ గత మోడల్‌లో అంతరిక్షంలోకి ముగ్గురిని మాత్రమే పంపే సామర్థ్యం కలిగి ఉండగా.. తాజా మోడల్‌లో ఆ సామర్థ్యాన్ని ఆరుగురికి పెంచింది.   

Updated Date - 2020-05-10T09:19:31+05:30 IST