ఐదుగురు అరుణాచల్‌ వాసుల్ని విడిచిపెట్టిన డ్రాగ‌న్‌..!

ABN , First Publish Date - 2020-09-13T13:34:00+05:30 IST

కిడ్నాప్‌ చేసిన ఐదుగురు అరుణాచల్‌ప్రదేశ్‌ పౌరులను చైనా విడిచిపెట్టింది.

ఐదుగురు అరుణాచల్‌ వాసుల్ని విడిచిపెట్టిన డ్రాగ‌న్‌..!

ఇటానగర్‌, సెప్టెంబరు 12: కిడ్నాప్‌ చేసిన ఐదుగురు అరుణాచల్‌ప్రదేశ్‌ పౌరులను చైనా విడిచిపెట్టింది. ఈ నెల రెండో తేదీన మెక్‌మెహాన్‌ రేఖకు సమీపాన అడవిలో వేటకు వెళ్లిన ఏడుగురు గిరిజనులను పీఎల్‌ఏ దళాలు అపహరించాయి. వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి భారత ఆర్మీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చైనాకు భారత్‌ సమాచారం పంపింది. కిడ్నాప్‌ చేసిన ప్రాంతానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో అంజా జిల్లా సరిహద్దుల్లో ఆ ఐదుగురినీ భారత సైన్యానికి అప్పగించింది. అలాగే రేఖ దాటివచ్చిన చైనా వాసులను, చైనాకు చెందిన జడల బర్రెలను భారత ఆర్మీ ఇటీవలే తిరిగి అప్పగించింది. 

Updated Date - 2020-09-13T13:34:00+05:30 IST