అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2020-06-21T13:08:17+05:30 IST

అంతర్జాతీయ విమానయానంపై కొనసాగుతున్న సందిగ్ధంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి స్పందించారు.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం ఏం చెప్పిందంటే..

విదేశాల్లో ప్రారంభమయ్యాకే..

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్ర మంత్రి పురి

న్యూఢిల్లీ, జూన్‌ 20: అంతర్జాతీయ విమానయానంపై కొనసాగుతున్న సందిగ్ధంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. వివిధ దేశాలకు చెందిన విమానాల పునఃప్రారంభం తర్వాతే మన విమనాల రాకపోకలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.  అప్పుడు కూడా అనుమతించిన గమ్యస్థాన దేశాలకే విమానాలు నడుస్తాయని తెలిపారు. దాని ప్రకారమే సమయాలను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. రోజుకు 700పైగా విమానాలు నడుస్తాయని మంత్రి తెలిపారు. కాగా.. దేశీయ విమానాల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితిని పరిస్థితులను బట్టి ఆగస్టు 24వ తేదీ తర్వాత వరకూ పొడిగించే అవకాశం ఉందని విమానయాన కార్యదర్శి పీఎస్‌ ఖరోలా తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు నగదు వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే, ఈ అంశం కోర్టులో ఉందని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసులను పెంచుతామని ఖరోలా చెప్పారు.


Updated Date - 2020-06-21T13:08:17+05:30 IST