మనిషి నుంచి పిల్లికి కరోనా!

ABN , First Publish Date - 2020-03-30T14:40:26+05:30 IST

ఇంత వరకు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకాయని విన్నాం. బెల్జియంలో ఇప్పుడు ఏకంగా యజమాని నుంచి తన పెంపుడు పిల్లికి కరోనా వైరస్‌ సోకింది. హాం

మనిషి నుంచి పిల్లికి కరోనా!

ఇంత వరకు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకాయని విన్నాం. బెల్జియంలో ఇప్పుడు ఏకంగా యజమాని నుంచి తన పెంపుడు పిల్లికి కరోనా వైరస్‌ సోకింది. హాంకాంగ్‌లో 17 కుక్కలను పరిశీలించారు. వాటిలో ఎనిమిది మంది కుక్కల యజమానులకు వైరస్‌ ఉంది. అందులో రెండు కుక్కలకే వైరస్‌ సోకింది.  బెల్జియంలోని లీగ్‌లో ఉన్న వెటర్నరీ మెడిసిన్‌ ఫ్యాకల్టీ తమ పరిశోధనలో వ్యక్తి నుంచి పెంపుడు పిల్లికి వైరస్‌ సోకిందని కనుగొన్నారు. ఇదొక అరుదైన కేసుగా అక్కడి డాక్టర్‌ అభివర్ణించారు. జంతువులు రోగవాహకాలనే తీరులో ఆలోచించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని చెప్పారు. పెంపుడు జంతువుల విషయంలో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించింది.


Updated Date - 2020-03-30T14:40:26+05:30 IST