బ్రెజిల్‌లో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి..!
ABN , First Publish Date - 2020-08-20T06:47:27+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థా

బ్రెజిల్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో దాదాపు 49వేల మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో సుమారు 1,365 మంది కరోనా కాటుకు కన్నుమూశారు. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 34లక్షలు దాటింది. ఇందులో 25.54లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 1.10లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రస్తుతం బ్రెజిల్‌లో 7.47లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.24కోట్లు దాటింది. ఇందులో 1.51కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 7.87లక్షల మంది ప్రాణాలు విడిచారు.