నయాగరా జలపాతంలో తొలిసారిగా మెరిసిన మువ్వన్నెల జెండా!

ABN , First Publish Date - 2020-08-16T23:59:53+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు.. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే సంబరాలు చే

నయాగరా జలపాతంలో తొలిసారిగా మెరిసిన మువ్వన్నెల జెండా!

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు.. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే సంబరాలు చేసుకున్నారు. న్యూయార్క్‌లోని టైమ్‌స్కైర్‌లో మొదటిసారిగా భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్.. జెండాను ఆవిష్కరించారు. కాగా.. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, దుబాయిలోని బుర్జ్ ఖలీఫా, కెనడాలోని నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా మెరిసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా.. నయాగరా జలపాతంలో తొలిసారిగా ప్రత్యేక లైటింగ్ ద్వారా ఏర్పాటు చేసిన భారత జాతీయ జెండా ప్రదర్శన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Updated Date - 2020-08-16T23:59:53+05:30 IST