కారు పార్ట్‌లను దొంగిలిస్తున్నారని.. అమెరికా మహిళ తెలివిగా ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-03-02T21:46:25+05:30 IST

దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు చెందిన మహిళ వినూత్న ఐడియాను అమలుచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్యాటీ క్యామరేనా అనే మహిళ కాలిఫోర్నియాలోని పోర్టర్‌విల్లేలో నివసిస్తోంది.

కారు పార్ట్‌లను దొంగిలిస్తున్నారని.. అమెరికా మహిళ తెలివిగా ఏం చేసిందంటే..

కాలిఫోర్నియా: దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు చెందిన మహిళ వినూత్న ఐడియాను అమలుచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్యాటీ క్యామరేనా అనే మహిళ కాలిఫోర్నియాలోని పోర్టర్‌విల్లేలో నివసిస్తోంది. ఆ ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాల్లోని ముఖ్యమైన పార్ట్‌లను దొంగలు దోచుకెళ్తున్నారు. వాహనాలు పార్కింగ్ చేసే చోట్ల పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేసినప్పటికి.. లాభం లేకపోయింది. దీంతో ఈ దొంగతనాలు జరగకుండా ఉండేందుకు.. క్యాటీ మంచి ఉపాయాన్ని ఆలోచించింది. బాగా ప్రెషర్‌తో కూడుకున్న మోషన్ యాక్టివేటెడ్ స్ప్రింక్లర్‌ను తన కారుపై ఏర్పాటుచేసింది. ఎవరైనా తన కారు దగ్గరకు చేరుకున్న వెంటనే.. ఆ స్ప్రింక్లర్ నుంచి వేగంగా నీళ్లు వస్తాయి. పైనున్న వీడియోలో గమనిస్తే.. ఓ వ్యక్తి సైకిల్‌పై కారు దగ్గరకు వచ్చిన వెంటనే స్ప్రింక్లర్ నుంచి నీళ్లు వచ్చాయి. ఈ దెబ్బకు ఆ వ్యక్తి వెంటనే వెనుదిరిగాడు. తన ఐడియా వర్కవుట్ అయిందని.. ఇదే ఐడియాను ఎవరైనా అనుసరించాలనుకుంటే అమెజాన్‌లో స్ప్రింకర్లు కొనుగోలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. 

Updated Date - 2020-03-02T21:46:25+05:30 IST