అమెరికాలో కరోనా విలయం.. ఆ ఒక్క రాష్ట్రంలోనే అర మిలియన్ కేసులు!

ABN , First Publish Date - 2020-08-02T03:32:20+05:30 IST

ప్రపచందేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి.. అగ్రరాజ్యం అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య

అమెరికాలో కరోనా విలయం.. ఆ ఒక్క రాష్ట్రంలోనే అర మిలియన్ కేసులు!

కాలిఫోర్నియా: ప్రపచందేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి.. అగ్రరాజ్యం అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా.. గతంలో న్యూయార్క్.. కరోనాకు హాట్‌స్పాట్‌గా ఉండగా.. తాజాగా కాలిఫోర్నియా మహమ్మారికి కేంద్రంగా మారింది. అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో.. దాదాపు 10శాతం కేసులు ఒక్క కాలిఫోర్నియాలోనే నమోదయ్యాయి. అమెరికాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 47లక్షలు దాటగా.. అందులో దాదాపు 5లక్షలకుపైగా కేసులు ఒక్క కాలిఫోర్నియాలోనే నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కాలిఫోర్నియాలో 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడ్డవారిలో 6వేల మంది.. ఇన్‌టెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ స్పందిస్తూ.. కరోనాను కట్టడి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా.. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా తర్వాత.. ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా కరోనా కాటుకు 1.56లక్షల మంది బలయ్యారు. 


Updated Date - 2020-08-02T03:32:20+05:30 IST