కస్టమర్లకు కీలక సూచన చేసిన బర్గర్ కింగ్!

ABN , First Publish Date - 2020-11-03T23:03:52+05:30 IST

అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సంస్థ బర్గర్ కింగ్.. తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. మెక్‌డోనల్డ్స్ తోపాటు ఇతర సంస్థల నుంచి కూడా ఫుడ్‌ను ఆర్డర్‌ చేయాలని ట్విట్టర్ ద్వారా కోరింది. వివరాల్లోకి వె

కస్టమర్లకు కీలక సూచన చేసిన బర్గర్ కింగ్!

లండన్: అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సంస్థ బర్గర్ కింగ్.. తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. మెక్‌డోనల్డ్స్ తోపాటు ఇతర సంస్థల నుంచి కూడా ఫుడ్‌ను ఆర్డర్‌ చేయాలని ట్విట్టర్ ద్వారా కోరింది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చాలా పరిశ్రమలు మూతపడి.. అందులో పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డునపడ్డారు. రెస్టారెంట్ ఇండస్ట్రీ‌పై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో యూకేలోని అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సంస్థ బర్గర్ కింగ్.. కీలక నిర్ణయం తీసుకుంది. మెక్‌డోనల్డ్స్‌ సహా ఇతర ఫాస్ట్‌ఫుడ్ సంస్థల నుంచి కూడా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవాలని తన కస్టమర్లను ట్విట్టర్ ద్వారా కోరింది. అలా చేయడం ద్వారా సదరు సంస్థలను నమ్ముకుని పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగాలు నిలపబడతాయని కస్టమర్లకు వివరించింది. ‘ఈ పని చేయమని మిమ్మల్ని అడుగుతామని అస్సలు అనుకోలేదు. కానీ.. రెస్టారెంట్‌లలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం మీ సపోర్ట్ కావాలి. మెక్‌డోనల్డ్స్‌తోపాటు ఇతర రెస్టారెంట్‌లలో కూడా మీరు ఫుడ్‌ను ఆర్డర్ చేయండి’ అని తన కస్టమర్లను ఉద్దేశిస్తూ బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. 


Updated Date - 2020-11-03T23:03:52+05:30 IST