ఏకత్వ భావన కల్పించిన దీపావళి: బ్రిటన్ రాణి ఎలిజబెత్
ABN , First Publish Date - 2020-12-27T12:43:01+05:30 IST
క్రిస్మస్ సందర్భంగా చేసిన సంప్రదాయ ప్రసంగంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ పలు పండుగల్ని గుర్తుచేసుకున్నారు.

మెర్రీ క్రిస్మస్ అని చెప్పడం సరికాదనిపిస్తోంది
లండన్, డిసెంబరు 26: క్రిస్మస్ సందర్భంగా చేసిన సంప్రదాయ ప్రసంగంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ పలు పండుగల్ని గుర్తుచేసుకున్నారు. ‘‘క్రైస్తవుల దృష్టిలో జీసస్ ఈ ప్రపంచానికి వెలుగు. కానీ ఆయన జన్మదినాన్ని మనం ఈసారి జరుపుకోలేకపోతున్నాం. ఈస్టర్, ఈద్, వైశాఖి వంటి పలు వేడుకల్ని ఆయా మతాలకు చెందిన వారు లాక్‌డౌన్‌లోనే చేసుకున్నారు. జీవితం ముందుకు సాగక తప్పదు. గత నెలలో విండ్సర్ కోట చుట్టూ ఆకాశం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. హిందువులు, సిక్కులు, జైనులు దీపావళిని ఘనంగా చేసుకున్నారు. అందరూ ఒకటేనన్న ఏకత్వ భావనను, ఆశను ఆ వేడుక కల్పించింది’’ అని ఎలిజబెత్ పేర్కొన్నారు.’