బ్రిటన్ క్వీన్‌కు కరోనా వ్యాక్సిన్..!

ABN , First Publish Date - 2020-12-06T21:56:25+05:30 IST

కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ప్రజలకు అందుబాటులోకి వచ్చే కరోనా వ్యాక్సిన్‌ను బ్రిటన్ రాణి తీసు

బ్రిటన్ క్వీన్‌కు కరోనా వ్యాక్సిన్..!

లండన్: కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ప్రజలకు అందుబాటులోకి వచ్చే కరోనా వ్యాక్సిన్‌ను బ్రిటన్ రాణి తీసుకోనున్నట్టు సమాచారం. బ్రిటన్ రాణితోపాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్(99) కూడా వ్యాక్సిన్‌ను వేయించుకోనున్నారు. టీకా తీసుకున్న అనంతరం రాజ దంపతులు ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం ద్వారా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు మందుకొస్తారని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో కొవిడ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ ప్రభుత్వం అమెరికా సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన టీకాకు అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రభుత్వం దాదాపు 40 మిలియన్ల వ్యాక్సిన డోసులకు ముందుగానే అర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో మొదటగా దాదాపు 8లక్షల డోసులతో వచ్చే వారం ప్రజలకు టీకాను అందించనుంది. కాగా.. యూకేలో ఇప్పటి వరకు 17లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడగా.. మరణాల సంఖ్య 60వేలు దాటింది. 


Updated Date - 2020-12-06T21:56:25+05:30 IST