కరోనా గురించి అమెరికా రచయిత్రికి ముందే తెలుసా!?

ABN , First Publish Date - 2020-03-14T02:21:05+05:30 IST

కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ఉద్భవించిన ఈ వైరస్.. క్రమంగా ప్రపంచ దేశాలకు పాకి, దాదాపు 5వేల మందిని పొట్టనపెట్టుకుం

కరోనా గురించి అమెరికా రచయిత్రికి ముందే తెలుసా!?

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ఉద్భవించిన ఈ వైరస్.. క్రమంగా ప్రపంచ దేశాలకు పాకి, దాదాపు 5వేల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. అమెరికాకు చెందని ఓ రచయిత్రి.. కొవిడ్-19 వైరస్ గురించి 12సంవత్సరాల ముందే చెప్పారనేది ఆ వార్త సారాంశం. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత్రి సిల్వియా బ్రౌన్.. 2008లో ‘ఎండ్ ఆఫ్ డేస్’ అనే పుస్తకాన్ని రాశారు. ‘2020 సంవత్సరంలో నిమోనియా తరహా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుంది’ అంటూ పుస్తకంలోని 312పేజీలో పేర్కొన్నారు. ఆమె రాసిన పుస్తకంలోని ఆ పేజీని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అదికాస్తా వైరల్‌గా మారింది. అయితే దీనిపైన స్పందింస్తున్న నెటిజన్లు మాత్రం.. ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. 


Updated Date - 2020-03-14T02:21:05+05:30 IST