పాకిస్థాన్‌ మదర్సాలో పేలుడు

ABN , First Publish Date - 2020-10-28T09:41:13+05:30 IST

పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలోని ఓ మదర్సాలో మంగళవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు

పాకిస్థాన్‌ మదర్సాలో పేలుడు

పెషావర్‌, అక్టోబరు 27: పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలోని ఓ మదర్సాలో మంగళవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు మృతి చెందగా 120 మంది గాయపడ్డారు. ఈ మదర్సాల్లోని విద్యార్థులంతా 7-11 ఏళ్లలోపు చిన్నారులే. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చిన్నారులు ఖురాన్‌ చదువుతుండగా మదర్సాలోని మసీదు గోడ వద్ద ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2020-10-28T09:41:13+05:30 IST