బైడెన్ ఆ రికార్డును కూడా అధిగమిస్తారా?

ABN , First Publish Date - 2020-11-06T21:20:43+05:30 IST

అయితే, బైడెన్‌ ముందు మరో రికార్డు ఉంది. ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ రికార్టును బైడెన్ చేధించడం సాధ్యమా కాదా అనే అనుమానాలు కలుగుతున్నాయి కానీ, ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నందున ఏదైనా

బైడెన్ ఆ రికార్డును కూడా అధిగమిస్తారా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకు చేరవలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. అత్యధిక ఓట్లు సాధించి అమెరికా ఎన్నికల చరిత్రలో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. గతంలో ఒబామా పేరిట ఉన్న ఈ రికార్డును ఈ ఎన్నికలతో బైడెన్ చెరిపివేశారు. 2012 ఎన్నికల్లో ఒబామాకు 6.59 కోట్ల ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో బైడెన్‌కు ఇప్పటికే (లెక్కింపు జరిగినంత వరకు) 7.3 కోట్ల ఓట్లు సాధించారు. కౌంటింగ్ ఈరోజు, రేపు కూడా కొనసాగేనున్నందున మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది.


అయితే, బైడెన్‌ ముందు మరో రికార్డు ఉంది. ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ రికార్టును బైడెన్ చేధించడం సాధ్యమా కాదా అనే అనుమానాలు కలుగుతున్నాయి కానీ, ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నందున ఏదైనా జరగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఈ రికార్డు ఏంటంటే.. అమెరికా 40వ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అత్యధిక శాతం ఓట్లు సాధించారు. 1984 ఎన్నికల్లో 58.8 ఓట్లు సాధించి అతి ఎక్కువ శాతం ఓటింగ్ మద్దతు సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత చాలా మంది అభ్యర్థులకు 50 శాతానికి మించి ఓట్లు సాధించినప్పటికీ రీగన్ రికార్డును మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేదు. ప్రస్తుతం బైడెన్‌కు 50.5 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 47.8 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. ఇంకా లెక్కించాల్సి ఓట్లు లక్షల్లో మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం లెక్కించే ఓట్లలో బైడెన్‌కు మద్దతుగానే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రీగన్ రికార్డు బైడెన్ అధిగమిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓటింగ్ పూర్తయ్యే సరికి ఏం జరుగుతుందో చూద్దాం.

Updated Date - 2020-11-06T21:20:43+05:30 IST