పీవీకి భారతరత్న.. ప్రవాస భారతీయ సంఘాల డిమాండ్ !

ABN , First Publish Date - 2020-12-31T01:00:15+05:30 IST

భారత మాజీ ప్రధాని.. మన తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రవాస భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో వినిపిస్తున్నాయి.

పీవీకి భారతరత్న.. ప్రవాస భారతీయ సంఘాల డిమాండ్ !

భారత మాజీ ప్రధాని.. మన తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రవాస భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అమెరికాలో దీనిని రిమెంబరింగ్ పీవీ సిరీస్‌లా మూడు 'R'లతో ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. 

1. శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు గారు

2. రిమైండ్ పీపుల్

3. రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ డిమాండ్‌తో ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆన్‌లైన్ ద్వారా తమ డిమాండ్‌కు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శత జయంతోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుండి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి.


దీనిలో భాగంగా గ్రాండ్ ఫినాలే సందర్భంగా ప్రవాస భారతీయ సంఘాల ముఖ్య నేతలు భారత్‌లో పర్యటించి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 

1. డిసెంబర్ 23న పీవీ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ మద్ధతుగా రూపొందించిన లఘు చిత్రం, క్యాలెండర్‌ను విడుదల చేశారు.

2. న్యూఢిల్లీలో పీవీ పేరిట రూపొందించిన ప్రత్యేకమైన సంచికను(పీవీ శతజయంతి వేడుకలు: ఎన్నారైస్ & ఎన్నారై సంస్థల) విడుదల చేసి పలువురు రాజకీయ ప్రముఖులకు అందజేశారు. 

3. ఎన్నారై సంస్థల సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఎన్నారైస్& పీవీ కుటుంబ సభ్యుల ప్యానెల్ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కార్యాలయాలకు అందించారు.


ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్నారై సంస్థల ప్యానెల్ కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా కలిశారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ఆయన శతజయంతి సందర్భంగా 2020లో భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరారు. ఇలా ఎన్నారై ప్యానెల్ కలిసిన ప్రముఖుల్లో...

1. విజయ్ చౌతైవాలే (ఇన్‌ఛార్జి, విదేశీ వ్యవహారాల శాఖ సభ్యుడు)

2. జి. కిషన్ రెడ్డి (భారత హోం సహాయ మంత్రి)

3. బండి నరసయ్య సంజయ్ కుమార్ పటేల్ (ఎంపి & బిజెపి అధ్యక్షుడు

తెలంగాణ)

4. ప్రకాష్ జవదేకర్ (పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి, సమాచార మరియు ప్రసార మంత్రి) 

5. సుబ్రమణియన్ స్వామి (రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు)

6. అరవింద్ ధర్మవరపు (పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ) 

7. అనిల్ శాస్త్రి (మాజీ ఎంపీ & లాల్ బహదూర్ శాస్త్రి మనవడు)

8. నరేంద్ర మోదీ కార్యాలయ కార్యదర్శి

9. గజేంద్ర సింగ్ షేఖావత్(కేంద్ర కేబినెట్ మంత్రి, జల్ శక్తి)

10. అమిత్ షా కార్యాలయ కార్యదర్శి

11. శ్రీరామ్ వెదిరే (చైర్మన్ జల వనరుల ప్రణాళిక అథారిటీ)తో పాటు మరికొంత మంది నేతలను ఎన్నారై ప్యానెల్ సభ్యులు కలిసి పీవీకి భారతర్న ఇవ్వాలని విన్నవించారు.  


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఈ సందర్భంగా హైదరాబాద్, ఢిల్లీలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సహకరించిన పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్ రావు, వాణీ సురభి రావు, ఎన్‌వీ సుభాష్(పీవీ మనవడు)తో పాటు డా. సరస్వతి కల్వకోటకు ఎన్నారై ప్యానెల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. ఇక తాము గ్రాండ్ ఫినాలే ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రజల మద్దతు కేంద్రంలోని ప్రభుత్వానికి చేరుతుందని, పివి నరసింరావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఎన్నారై ప్యానెల్  ఆశాభావం వ్యక్తం చేసింది. 


అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(AAPI), ఉత్తర అమెరికా తెలుగు సంఘము(TANA), అమెరికా తెలుగు సంఘం(ATA), నాట్స్(NATS), ఉత్తర అమెరికా తెలుగు సమితి(NATA), సిలికానాంధ్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(TDF), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌తో పాటు అమెరికాకు చెందిన 81 సంస్థలు పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తూ, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇక ఎన్నారై కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు(సెయింట్ లూయిస్, MO), బడ్డి అశోక్, దేవబత్తిని హరి(డెట్రాయిట్, MI), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర(ఎడిసన్, NJ), పురం ప్రవీణ్ (అట్లాంటా, GA), కొండెపు సుధ (DC), చల్లా కవిత(వాషింగ్టన్ డీసీ), అట్లూరి శ్రీహరి(LA), కల్వకోట సరస్వతి(OH) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న డిమాండ్‌ను ముందుకు తీసుకువెళ్తున్న వారిలో ఉన్నారు.


Important Links to be included in every press release and emails

I. YouTube Channel: https://youtube.com/playlist?list=PLWWJmnTmbEVArAwiUdWfqIVxV9bGHNP_c

II. Facebook Page : https://www.facebook.com/BharatRatna4PV-104140028106254

III. PV Narasimha Rao Centenary Calendar (2021) : https://online.flipbuilder.com/mikkiphotos/sani/

IV. Short Film (TELUGU) : BharatRatna4PV - A Pride of India

by NRIs & NRI Organizations.: https://youtube.com/embed/fcNyBs4O5fQ

V. Short Film (HINDI) : BharatRatna4PV - A Pride of India

by NRIs & NRI Organizations.: https://www.youtube.com/watch?v=wudtQ6q79ZM

VI. Souvenir : https://online.flipbuilder.com/mikkiphotos/zbxn/

VII. Petition : https://1drv.ms/b/s!Ag6ZqyL19AcQg8okNCBvVHcgje4Yiw?e=ZSnpfh 

Updated Date - 2020-12-31T01:00:15+05:30 IST