యూరప్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

ABN , First Publish Date - 2020-10-24T23:40:00+05:30 IST

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. తమ మూలాలను మాత్రం తెలుగువారు మర్చిపోలేరు. మన పండుగలను, సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంటారు..

యూరప్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. తమ మూలాలను మాత్రం తెలుగువారు మర్చిపోలేరు. మన పండుగలను, సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంటారు.. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు వేల సంఖ్యలో ఎన్నారైలు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో కూడా తెలుగు ప్రవాసీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూరప్‌లో ఈ వేడుకలు జరిగాయి.. స్థానికంగా ఉన్న పలువురు ప్రవాసులు దీంట్లో పాల్గొన్నారు. యూరప్‌తోపాటు స్వీడన్‌లో కూడా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.


తెలంగాణ అసోసియేషన్ ఫ్రాన్స్ విభాగం కన్వీనర్ తిగుళ్ల ప్రియా అద్వర్యంలో పారిస్‌లో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా కొద్ది మందితోనే స్థానికంగా ఉన్న పార్కులో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నీల శ్రీనివాస్-రజిత, శ్రీనివాస్ తిగుళ్ల, నవీన్ -సాద్విక, మనోజ్, రవికిరణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. తెలుగువారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లినా.. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. 


అలాగే తెలంగాణ అసోసియేషన్ స్వీడన్ విభాగం కన్వినర్ మంజూష ఆధ్వర్యంలో స్టాక్హోల్మ్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద అందరు మహిళలు పాల్గొని బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పలువురు ప్రవాసీయులు పేర్కొన్నారు. భారత్‌కు, తెలుగు నేలకు దూరంగా ఉన్నా.. తెలంగాణ సంస్కృతిని కొనసాగించటం తమకు ఆనందంగా ఉందని మంజూష తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వీడన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్-అనిత, మానస, కవిత, శ్వేతా, స్నేహ , శ్రావణి, జయంతి పాల్గొన్నారు. ఇలాగే భవిష్యత్‌లోనూ తెలుగు పండుగలను జరుపుకుంటామనీ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు.



Updated Date - 2020-10-24T23:40:00+05:30 IST