విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ నౌక !

ABN , First Publish Date - 2020-10-14T12:58:33+05:30 IST

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వాణిజ్య నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది.

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ నౌక !

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వాణిజ్య నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. బంగ్లాదేశ్‌లోని పోర్టు యాంకరేజి నుంచి ‘ఎంవీ మా’ అనే వాణిజ్యనౌక విశాఖ పోర్టు నుంచి సరుకు తీసుకువెళ్లేందుకు వచ్చింది. సరుకు లోడింగ్‌కు అనుమతులు రాకపోవడంతో పోర్టుకు సమీపాన లంగరు వేసుకొని వేచి ఉంది. సోమవారం రాత్రి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు లంగరు తాళ్లు తెగిపోయాయి. దీంతో 80 మీటర్ల పొడవైన ఈ నౌక ఇసుకలో చిక్కుకుపోయింది. -విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-14T12:58:33+05:30 IST