బంగ్లాదేశ్‌లో ఒక్కరోజే భారీగా నమోదైన కరోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-06-18T07:00:49+05:30 IST

బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 4,008 కేసులు నమోద

బంగ్లాదేశ్‌లో ఒక్కరోజే భారీగా నమోదైన కరోనా కేసులు..!

ఢాకా: బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 4,008 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 98వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే బంగ్లాదేశ్‌లో 43మంది మరణించారు. కరోనా కాటుకు ఇప్పటి వరకు అక్కడ 1305మంది ప్రాణాలు విడిచారు. కాగా..దాదాపు 38వేల మంది కరోనాని జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. 


Updated Date - 2020-06-18T07:00:49+05:30 IST