బ్రిటన్ సరసన బహ్రెయిన్.. ఫైజర్ టీకాకు గ్రీన్‌ సిగ్నల్

ABN , First Publish Date - 2020-12-05T13:59:27+05:30 IST

అమెరికన్ ఫైజర్ సంస్థ, జర్మన్ బయో ఎన్‌టెక్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్‌కు బుధవారం బ్రిటన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

బ్రిటన్ సరసన బహ్రెయిన్.. ఫైజర్ టీకాకు గ్రీన్‌ సిగ్నల్

మనామా: అమెరికన్ ఫైజర్ సంస్థ, జర్మన్ బయో ఎన్‌టెక్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్‌కు బుధవారం బ్రిటన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫైజర్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా యూకే నిలిచింది. తాజాగా బ్రిటన్ సరసన గల్ఫ్ దేశం బహ్రెయిన్ చేరింది. బహ్రెయిన్ కూడా ఫైజర్ టీకాకు ఓకే చెప్పింది. బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎన్ని డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేస్తోందో మాత్రం వెల్లడించలేదు. అప్పుడే వ్యాక్సిన్ స్టోరేజీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్టు అథారిటీ అధికారులు తెలిపారు. 


అలాగే నవంబర్‌లో ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం చైనాకు చెందిన సినోఫార్మ్ కొవిడ్ వ్యాక్సిన్‌ను కూడా బహ్రెయిన్ ఆమోదించిన విషయం తెలిసిందే. సుమారు 6వేల మందికి ఈ టీకాను ఇవ్వడం జరిగింది. కాగా, మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలనే ఏకైక ఉద్దేశంతోనే అత్యవసరంగా ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపినట్టు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ మరియం అల్ జలహ్మా వెల్లడించారు. ఇక బహ్రెయిన్ జనాభా 1.6 మిలియన్లు ఉంటే... 87 వేల మంది కొవిడ్ బారిన పడ్డారు. 341 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బహ్రెయిన్ 2 మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.  

Updated Date - 2020-12-05T13:59:27+05:30 IST