10వేల మంది ఆస్ట్రేలియా పౌరులు ఇండియాలోనే ఉండిపోయారు!
ABN , First Publish Date - 2020-12-11T22:46:18+05:30 IST
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తమ పౌరుల సంఖ్య ఇంకా భారీగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. శుక్రవారం రోజు 32వ నేషనల్ క్యాబినేట్‌ను నిర్వహించి కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ
మెల్బోర్న్: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తమ పౌరుల సంఖ్య ఇంకా భారీగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. శుక్రవారం రోజు 32వ నేషనల్ క్యాబినేట్‌ను నిర్వహించి కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థను వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఆంక్షల కారణంగా సుమారు 85వేల మంది ఆస్ట్రేలియా పౌరులు విదేశాల్లో చిక్కుకున్నారని వెల్లడించారు. సెప్టెంబర్ 18 నుంచి చేపట్టిన తరలింపు ప్రక్రియ ద్వారా దాదాపు 46వేల మంది తిరిగి స్వదేశానికి చేరుకున్నట్టు చెప్పారు.
39వేల మంది ఇంకా విదేశాల్లోనే ఉన్నట్టు తెలిపారు. వారంతా స్వదేశానికి తిరిగి రావడానికి రిజిస్టర్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ 39వేలలో దాదాపు 10వేల మంది ఇండియాలోనే ఉన్నారని వెల్లడించారు. విదేశాల్లో చిక్కుకున్న వారితో టచ్‌లో ఉంటూనే స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాకుండా కొవిడ్ 19 వ్యాక్సినైజేషన్ పాలసీపై కూడా నేషనల్ క్యాబినేట్‌లో చర్చించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు దాదాపు 28వేల మంది కొవిడ్ బారినపడగా.. ఇందులో 908 మంది ప్రాణాలు కోల్పోయారు.