అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం.. ఇకపై అది అక్కడ చట్టబద్ధం!

ABN , First Publish Date - 2020-12-31T01:36:12+05:30 IST

అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్లను చట్టబద్ధం చేసింది.

అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం.. ఇకపై అది అక్కడ చట్టబద్ధం!

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్లను చట్టబద్ధం చేసింది. దీంతో దక్షిణ అమెరికా దేశాలలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న దేశంగా అర్జెంటీనా నిలిచింది. సుమారు నాలుగున్నర కోట్ల మంది జనాభా గల అర్జెంటీనాలో ప్రతియేటా చట్టవిరుద్ధంగా వేలాది అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది అబార్షన్లను అనుమతించవద్దని నిరసన గళం వినిపించారు. కానీ, అర్జెంటీనా సెనేట్‌ విటన్నింటినీ కాదని 38–29 ఓట్ల తేడాతో అబార్షన్లను చట్టబద్ధం చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. 14 వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కాగా, 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఫలించలేదు.

Updated Date - 2020-12-31T01:36:12+05:30 IST