అమెరికన్ల ఫోన్లపై నిఘా చట్ట వ్యతిరేకమే

ABN , First Publish Date - 2020-09-05T14:27:53+05:30 IST

‘‘అమెరికన్ల ఫోన్లపై నిఘా పెట్టడం.. రహస్యంగా సంభాషణలను రికార్డు చేయడం చట్ట వ్యతిరేకం. అది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఫారిన్‌ ఇంటెలిజెన్స్

అమెరికన్ల ఫోన్లపై నిఘా చట్ట వ్యతిరేకమే

ఏడేళ్ల తర్వాత తీర్పు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 4: ‘‘అమెరికన్ల ఫోన్లపై నిఘా పెట్టడం.. రహస్యంగా సంభాషణలను రికార్డు చేయడం చట్ట వ్యతిరేకం. అది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్స్‌ చట్టం ప్రకారం అమెరికా జాతీయ భద్రత విభాగం(ఎన్‌ఎ్‌సఏ) చేసింది తప్పే’’ అని అమెరికా కోర్టు వ్యాఖ్యానించింది. ఏడేళ్ల క్రితం ఎన్‌ఎ్‌సఏ కాంట్రాక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌.. అమెరికన్ల ఫోన్లపై ఆ సంస్థ నిఘాపెట్టిందంటూ మీడియా సమక్షంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రష్యాకు వెళ్లారు. స్నోడెన్‌పై అమెరికా పోలీసులు గూఢచర్య నేరారోపణలు చేస్తూ కేసు పెట్టారు. ఇంకా ఆ కేసు కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్‌ఎ్‌సఏ చర్యపై ఏడేళ్ల పాటు వాదప్రతివాదనలు విన్న కోర్టు.. బుధవారం తీర్పునిచ్చింది. ఫోన్లపై నిఘా వల్లే తీవ్రవాదులు, ఉగ్రవాదులను గుర్తించగలమని ఎన్‌ఎ్‌సఏ వాదించినా.. ఆ చర్య చట్ట వ్యతిరేకమని పేర్కొంది. 

Updated Date - 2020-09-05T14:27:53+05:30 IST