కొనసాగుతున్న ఆటా ‘ఝుమ్మంది నాదం’పాటల పోటీలు!

ABN , First Publish Date - 2020-07-19T01:39:28+05:30 IST

అమెరికా తెలుగు సంఘం(ఆటా).. ‘ఝుమ్మంది నాదం’జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను జూలై 4,5,11 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఈ కా

కొనసాగుతున్న ఆటా ‘ఝుమ్మంది నాదం’పాటల పోటీలు!

అమెరికా తెలుగు సంఘం(ఆటా).. ‘ఝుమ్మంది నాదం’జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను జూలై 4,5,11 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలురాష్ట్రాల నుంచి దాదాపు 80 మంది గాయని, గాయకులు పాల్గొన్నారు. ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రామకృష్ణా రెడ్డి, ఝుమ్మంది నాదం చైర్ శారదా సింగిరెడ్డి కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుంచి సంగీత దర్శకులు శ్రీని ప్రభల, రాజ శేఖర్ సూరిబొట్ల, నిహాల్ కొండూరి, కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్లు సురేఖ మూర్తి దివాకర్ల, నూతన మోహన్, ప్రవీణ్ కుమార్ కొప్పోలు ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కాగా.. ఈ పోటీల్లో వర్జీనియా, న్యూజెర్సీ, జార్జియా, కాలిఫోర్నియా, మసాచూట్స్, మిచిగాన్, వాషింగ్టన్ టెక్సాస్, మిన్నెసోటా రాష్ట్రాల నుంచి 1, అభిజ్ఞ ఎనగంటి, 2. అభిరాం తమన్న 3. ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల  4. అతిథి నటరాజన్ 5.  అంజలి కందూర్ 6.హర్షిని మగేశ్ 7.హర్షిత వంగవీటి 8. లాస్య ధూళిపాళ 9. మల్లిక సూర్యదేవర 10. మేధ అనంతుని 11.  ప్రణీత విష్ణుబొట్ల 12. రోషిని బుద్ధ 13. శశాంక ఎస్.యెన్ 14. శ్రియ నందగిరి 15. ఐశ్వర్య నన్నూర్‌ను ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు ఫైనలిస్ట్‌లకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలను ఆగస్టు 2న..  ఫైనల్స్‌ను ఆగస్ట్ 8,9 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరరెడ్డి మాట్లాడుతూ.. ఝుమ్మంది నాదం పాటల పోటీల విజయవంతానికి కృషి చేస్తున్న వారిని ప్రశంసించారు. 


Updated Date - 2020-07-19T01:39:28+05:30 IST