ప్రముఖ కమెడియన్ కన్నుమూత..!

ABN , First Publish Date - 2020-05-17T22:22:42+05:30 IST

అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ ఫ్రెడ్ విల్లార్డ్ శుక్రవారం రోజు లాస్ ఏంజెల్స్‌లో మరణించారు. ఫ్రెడ్ విల్లార్డ్ మరణ వార్తను ఆయన కూతురు హోప్ విల్లార్డ్.. ట్విట్టర్

ప్రముఖ కమెడియన్ కన్నుమూత..!

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ ఫ్రెడ్ విల్లార్డ్ శుక్రవారం రోజు లాస్ ఏంజెల్స్‌లో మరణించారు. ఫ్రెడ్ విల్లార్డ్ మరణ వార్తను ఆయన కూతురు హోప్ విల్లార్డ్.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘విషాదకరమైన వార్తను నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. 86ఏళ్ల వయసులో నా తండ్రి, నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన తన తుదిశ్వాస విడిచే వరకు మమల్ని సంతోష పెట్టేందుకే ప్రయత్నించారు. ఆయనంటే మాకు చాలా ఇష్టం. వి మిస్ హిమ్’ అంటూ హోప్ విల్లార్డ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. కాగా.. బెస్ట్ ఇన్ షో, దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్ తదితర సినిమాల్లా నటించిన ఫ్రెడ్ విల్లార్డ్.. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. 


Updated Date - 2020-05-17T22:22:42+05:30 IST