అమెరికాలో హక్కుల ఉద్యమకారుడు వివియన్ ఇకలేరు
ABN , First Publish Date - 2020-07-18T13:54:19+05:30 IST
అమెరికాలో పౌర హక్కుల ఉద్యమకారుడు కార్డీ టిండెల్ వివియన్(95) మరణించారు.

అట్లాంటా, జూలై 17: అమెరికాలో పౌర హక్కుల ఉద్యమకారుడు కార్డీ టిండెల్ వివియన్(95) మరణించారు. వయోభారం వల్ల తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన శుక్రవారం అట్లాంటాలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. వివియన్ పౌరహక్కుల ఉద్యమంలో 60 ఏళ్లకుపైగా క్రియాశీలక పాత్ర పోషించారు. అమెరికాలో పౌరహక్కుల పోరాట యోధుడైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో కలిసి కూడా ఆయన కొన్నాళ్లు పనిచేశారు. మార్టిన్ స్థాపించిన సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.