చికాగోలో దారుణం.. ఫేస్‌మాస్క్ ధరించమని చెప్పినందుకు..

ABN , First Publish Date - 2020-10-28T08:09:31+05:30 IST

ఫేస్‌మాస్క్ ధరించమని చెప్పినందుకు చికాగోలో ఓ యువతి రిటైల్ స్టోర్ ఉద్యోగిని దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చికాగోలో దారుణం.. ఫేస్‌మాస్క్ ధరించమని చెప్పినందుకు..

చికాగో: ఫేస్‌మాస్క్ ధరించమని చెప్పినందుకు చికాగోలో ఓ యువతి రిటైల్ స్టోర్ ఉద్యోగిని దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చికాగోలోని ఓ రిటైల్ స్టోర్‌కు ఆదివారం సాయంత్రం జెస్సికా హిల్(21), జైలా హిల్(18) అనే ఇద్దరు యువతులు వెళ్లారు. కరోనా నిబంధనలు పాటించకపోవడంతో స్టోర్‌ ఉద్యోగి ఫేస్‌మాస్క్ ధరించమంటూ యువతులకు చెప్పాడు. తాము ఫేస్‌మాస్క్ ధరించమంటూ ఇద్దరు యువతులు ఉద్యోగితో ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో జైలా హిల్ ఉద్యోగి చాతిపై దాడి చేసింది. జైలా హిల్ అతడి జుట్టు పట్టుకుని కింద పడేయగా.. జెస్సికా హిల్ కత్తితో అతడిని 27 సార్లు పొడిచింది. 


మెడ, వీపు, చేతులపై యువతి పొడవడంతో ఉద్యోగి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు కారణమైన ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి కేసును నవంబర్‌కు వాయిదా వేశారు. అంతేకాకుండా యువతులిద్దరూ బెయిల్ కోరగా జడ్జి తిరస్కరించారు. 

Updated Date - 2020-10-28T08:09:31+05:30 IST