బీచ్‌లో డెడ్‌బాడీ అంటూ ఫోన్.. తీరా వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2020-11-26T09:26:35+05:30 IST

అమెరికాలో ఓ మహిళ బొమ్మను చూసి శవం అనుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. వివరంగా చెప్పాలంటే.. ఫ్లోరిడాకు చెందిన

బీచ్‌లో డెడ్‌బాడీ అంటూ ఫోన్.. తీరా వచ్చి చూస్తే..

ఆర్లాండో: అమెరికాలో ఓ మహిళ బొమ్మను చూసి శవం అనుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. వివరంగా చెప్పాలంటే.. ఫ్లోరిడాకు చెందిన మహిళ పెర్డిడో కీ బీచ్‌కు వెళ్లింది. ఆ బీచ్‌లో మహిళ సముద్రపుపాచితో కప్పేసి ఉన్న బొమ్మ(బట్టల దుకాణాల్లో ఉండే మనిషి బొమ్మ)ను చూసి శవం అనుకుంది. అంతే.. వెంటనే అధికారులకు సమాచారమిచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు అది శవం కాదు.. బొమ్మ అన్న విషయాన్ని తెలుసుకుని షాకయ్యారు. బొమ్మ చాలా కాలం పాటు సముద్రంలో ఉండి ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకురావడంతో బొమ్మ పైభాగం మొత్తం పాచితో కప్పేసినట్టు అయిందని పోలీసులు తెలిపారు. బీచ్‌కు పోలీసులు కూడా రావడంతో ఆ బొమ్మను చూసేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు.

Updated Date - 2020-11-26T09:26:35+05:30 IST