కరోనా బారిన పడి.. అక్కాచెల్లెళ్లు మృతి

ABN , First Publish Date - 2020-03-31T03:56:01+05:30 IST

అమెరికాలో కరోనా బారిన పడి రోజుల తేడాతో అక్కాచెల్లెళ్లు మరణించారు. ఇల్లినోయిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కరోనా బారిన పడి.. అక్కాచెల్లెళ్లు మృతి

స్ప్రింగ్‌ఫీల్డ్: అమెరికాలో కరోనా బారిన పడి రోజుల తేడాతో అక్కాచెల్లెళ్లు మరణించారు. ఇల్లినోయిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాట్రీసియా అనే మహిళ మార్చి 16వ తేదీన కరోనా కారణంగా మృతిచెందింది. ఇల్లినోయిలో కరోనా బారిన పడి మరణించిన మొదటి వ్యక్తి పాట్రీసియానే కావడం గమనార్హం. పాట్రీసియా మరణించిన రోజునే ఆమె సోదరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవడంతో పాట్రీసియా సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె గత బుధవారం మరణించింది. వీరిద్దరూ ఆసుపత్రిలోనే చనిపోయారని.. కనీసం చివరిచూపు చూసుకునే అవకాశం కూడా తమకు దక్కలేదని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా.. ఇల్లినోయి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను బయటకు రావద్దంటూ హెచ్చరించింది. ఎవరితో మాట్లాడాలన్నా వీడియో కాల్ ద్వారానే మాట్లాడమంటూ సూచించింది.  

Updated Date - 2020-03-31T03:56:01+05:30 IST