-
-
Home » NRI » America Nagarallo » Toddlers reaction after mom pretends to
-
చిన్నారి అమాయకత్వానికి నెజిజన్లు ఫిదా!
ABN , First Publish Date - 2020-12-16T02:14:38+05:30 IST
ఓ చిన్నారి అమాయకత్వం నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నె

కెన్సాస్: ఓ చిన్నారి అమాయకత్వం నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కెన్సాస్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు జోషఫైన్ చార్లీ.. కెమెరా వైపునకు చూస్తున్న సమయంలో ఆమె చేతి వేళ్లను నోట్లో పెట్టుకుంది. అంతేకాకుండా ఆ వేళ్లను కొరుక్కుని కరకరా నమిలేసినట్టు నటిస్తుంది. ఈ క్రమంలో చార్లీ.. కెమెరా వైపు నుంచి తన దృష్టిని తిప్పి చేతి వేళ్లను చూసుకుంటుంది. నిజంగానే తన తల్లి చేతి వేళ్లను కొరుక్కుని తిన్నదని భ్రమపడి బోరున ఏడుస్తుంది. ఈ వీడియోను సదరు మహిళ ‘తన వేళ్లు తిన్నందుకు చార్లీ ఇప్పటికీ నాపై కోపంగా ఉంది’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియోకు లైక్‌లు కొడుతూ.. చార్లీ అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి