కరోనా అంశంపై టాంటెక్స్ వెబినార్.. పాల్గొన్న ప్రొఫెసర్ సాంబా రెడ్డి

ABN , First Publish Date - 2020-05-18T21:54:43+05:30 IST

కరోనా వ్యాప్తి, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఉత్తర టెక్సాస్ తెలుగు

కరోనా అంశంపై టాంటెక్స్ వెబినార్.. పాల్గొన్న ప్రొఫెసర్ సాంబా రెడ్డి

డాలస్: కరోనా వ్యాప్తి, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) వెబినార్ నిర్వహించింది. శనివారం సాయంత్రం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ సాంబా రెడ్డి పాల్గొన్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరగగా.. కరోనాపై ఉన్న సందేహాలను సాంబారెడ్డి తీర్చారు. అమెరికాలో కరోనా వ్యాప్తి అంతలా పెరగడానికి కారణాల గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారు సాంబారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుంది.. కరోనా వ్యాప్తిని ఎలా ఆపాలన్న దానిపై సాంబారెడ్డి వివరించారు. అంతేకాకుండా కరోనా నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మాట్లాడారు. కాగా.. సాంబారెడ్డి టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ సమావేశం మొత్తం తెలుగులోనే జరగిందని.. అమెరికాలో కరోనా అంశంపై సుదీర్ఘంగా తెలుగులో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని సాంబారెడ్డి అన్నారు.

Updated Date - 2020-05-18T21:54:43+05:30 IST