న్యూయార్క్‌లో 24 గంటల్లో 731 మంది మృతి

ABN , First Publish Date - 2020-04-08T03:30:00+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితి

న్యూయార్క్‌లో 24 గంటల్లో 731 మంది మృతి

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,69,069 కేసులు నమోదవగా.. 11,008 మంది మృతిచెందారు. ఇక న్యూయార్క్‌లో పరిస్థితి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. గడిచిన 24 గంటల్లో న్యూయార్క్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్లడించారు. సోమవారం న్యూయార్క్‌లో 731 మంది మృతిచెందినట్టు ఆయన ప్రకటించారు. దీంతో న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,489కి చేరింది. మరోపక్క న్యూయార్క్‌ నగరంలో మరణించిన వారిని పూడ్చడానికి స్థలాలు కూడా సరిపోకపోవడంతో ప్రభుత్వం ఓ ఐల్యాండ్‌ను సైతం సిద్దం చేసింది.

Updated Date - 2020-04-08T03:30:00+05:30 IST