ఆ జాబితాలోకి మరో నాలుగు రాష్ట్రాలను చేర్చిన న్యూయార్క్

ABN , First Publish Date - 2020-07-15T04:24:33+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

ఆ జాబితాలోకి మరో నాలుగు రాష్ట్రాలను చేర్చిన న్యూయార్క్

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలల్లో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడంతో.. ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా అదుపులోకి వచ్చింది. అయితే మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో న్యూయార్క్ జాగ్రత్త పడుతోంది. మరోమారు కరోనాకు కేంద్రంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనేక రాష్ట్రాలపై క్వారంటైన్ నిబంధనలను పెట్టింది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో నాలుగు రాష్ట్రాల(మిన్నెసొటా, న్యూమెక్సికో, ఒహాయో, విస్కాన్సిన్)ను చేర్చింది. అంటే.. ఈ రాష్ట్రాల నుంచి న్యూయార్క్ వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. వరుసగా ఏడు రోజుల్లో ఏ రాష్ట్రంలో అయితే కరోనా కేసుల పాజిటివ్ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉంటుందో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 


న్యూయార్క్ క్వారంటైన్ నిబంధనలను పెట్టిన రాష్ట్రాలు ఇవే:

 • అలబామా
 • అర్కన్సాస్
 • అరిజోనా
 • కాలిఫోర్నియా
 • ఫ్లోరిడా
 • జార్జియా
 • అయోవా
 • ఇదాహో
 • కాన్సాస్
 • లూజియానా
 • మిన్నెసొటా
 • మిస్సిస్సిప్పి
 • నార్త్ కెరోలినా
 • న్యూ మెక్సికో
 • నెవాడా
 • ఒహాయో
 • ఓక్లహోమా
 • సౌత్ కెరోలినా
 • టెన్నెస్సీ
 • టెక్సాస్
 • ఊతా
 • విస్కాన్సిన్

Updated Date - 2020-07-15T04:24:33+05:30 IST