కాలిఫోర్నియాను వణికిస్తున్న పిడుగుపాట్లు.. 72 గంటల్లో..
ABN , First Publish Date - 2020-08-20T19:29:01+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో పిడుగుపాట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి.

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో పిడుగుపాట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం 72 గంటల వ్యవధిలోనే 11వేల పిడుగుపాట్లతో 367 చోట్ల మంటలు అంటుకున్నాయి. భారీ సంఖ్యలో గృహాలు ధ్వంసం అయ్యాయి. దీంతో వేలాది మందిని అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత దశాబ్ద కాలంలో ఇదే అతిపెద్ద విపత్తు అని కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఇక 367 చోట్ల అగ్ని కిలలు విస్తరించడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. మరోవైపు సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పబోయిన హెలీకాఫ్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఫైలట్ మృతి చెందారు. మంగళవారం ప్రారంభమైన పిడుగుపాట్లు శాంటా క్లారా, అల్మెడ, కాంట్రా కోస్టా, శాన్ జోక్విన్ మరియు స్టానిస్లాస్ కౌంటీలలో 85,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని కాల్చి బూడిద చేసింది.