-
-
Home » NRI » America Nagarallo » Five people seriously injured in Texas shooting
-
టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-06-22T06:07:20+05:30 IST
అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్-ట్రావిస్

టెక్సాస్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్-ట్రావిస్ కౌంటీలో దుండగులు కాల్పులు జరపగా.. ఈ దాడిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈస్ట్ సెవంత్ స్ట్రీట్‌లోని 500 బ్లాక్స్‌లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. కాల్పులు జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం పోలీసు బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. అసలు ఈ కాల్పులు ఎందుకు జరిగాయన్నది తెలియాల్సి ఉంది. కాల్పుల్లో గాయపడిన వారంతా మధ్య వయస్కులేనని అధికారులు చెబుతున్నారు. కాల్పులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని.. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మిన్నెపొలిస్‌లో శనివారం అర్థరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.