టెక్సాస్‌లో ఒక్కసారిగా పెరిగిన కేసులు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-05-17T07:47:48+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత రెండు వారాల్లో కరోనా కేసులు పెరిగినట్టు

టెక్సాస్‌లో ఒక్కసారిగా పెరిగిన కేసులు.. కారణమేంటంటే..

శాన్ ఆంటోనియో: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత రెండు వారాల్లో కరోనా కేసులు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం.. టెక్సాస్ ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. టెక్సాస్‌లో ఇప్పటివరకు 45,198 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే టెక్సాస్‌లో 1,347 కేసులు నమోదయ్యాయి. ఇక గురువారం 58 మరణిస్తే.. శుక్రవారం 56 మంది మరణించారు. ఇదిలా ఉంటే.. కరోనా పరీక్షల సంఖ్య పెరగడం కారణంగానే.. కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని ఓ ప్రభుత్వాధికారి చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో 3.3 లక్షల పరీక్షలు చేస్తే.. మే 1 నుంచి 16 వరకు 3.3 లక్షలు చేశామన్నారు. ఏప్రిల్ నెలతో పోల్చితే కరోనా కేసుల సంఖ్య తగ్గిందన్నారు. టెక్సాస్ ప్రభుత్వం ఏప్రిల్ 30న ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతులిచ్చింది. ఇప్పటికే టెక్సాస్ వ్యాప్తంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ కూడా నడుస్తున్నాయి. సోమవారం నుంచి జిమ్‌లు కూడా మొదలుకానున్నాయి. టెక్సాస్‌లోని 2.9 కోట్ల జనాభాకు గాను  ప్రభుత్వం ఇప్పటివరకు 6.46 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. 

Updated Date - 2020-05-17T07:47:48+05:30 IST