సోదరికి ఎన్‌95 మాస్క్‌లు ఇవ్వడం కోసం.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-05-11T22:26:39+05:30 IST

వైద్యురాలిగా పనిచేస్తున్న సోదరి కోసం అమెరికాలో ఓ వ్యక్తి 852 కి.మీ. కారులో ప్రయాణించాడు.

సోదరికి ఎన్‌95 మాస్క్‌లు ఇవ్వడం కోసం.. అమెరికాలో..

న్యూజెర్సీ: వైద్యురాలిగా పనిచేస్తున్న సోదరి కోసం అమెరికాలో ఓ వ్యక్తి 852 కి.మీ. కారులో ప్రయాణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాజ్‌కాజీ అనే వ్యక్తి న్యూజెర్సీలోని వివింత్ సోలార్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఎన్95 మాస్క్‌లను డొనేట్ చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో యాజ్‌కాజీకి వైద్యుర్యాలిగా పనిచేస్తున్న తన సోదరి అలెక్సిస్ షుల్మన్ గుర్తుకొచ్చింది. అలెక్సిస్ నార్త్ కరోలినాలోని కోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆ ఆసుపత్రిని ప్రస్తుతం కరోనా పేషంట్ల కోసమే కేటాయించారు. ఇదే సమయంలో ఆసుపత్రిలోని సిబ్బందికి మాత్రం ఎన్95 మాస్క్‌లను అధికారులు అందజేయలేదు. దీంతో యాజ్‌కాజీ తన స్నేహితుడితో కలిసి న్యూజెర్సీ నుంచి నార్త్‌ కరోలినాకు వెళ్లి ఆసుపత్రి సిబ్బందికి ఎన్95 మాస్క్‌ల బాక్సును అందజేశాడు. తన సోదరి, ఆసుపత్రి సిబ్బంది కోసం అంతదూరం ప్రయాణించిన యాజ్‌కాజీకి ఆసుపత్రి యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. తన సోదరి కరోనా పేషంట్ల కోసం అహర్నిశలు పనిచేస్తోందని.. వారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తోందని యాజ్‌కాజీ చెప్పాడు. ఇదే సమయంలో పేషంట్లతో పాటు తన సోదరి, ఇతర సిబ్బంది ప్రాణాలు కూడా ముఖ్యమేనని వివరించాడు. ప్రతి ఒక్క సంస్థ తమ ఉద్యోగుల ప్రాణాల గురించి కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా యాజ్‌కాజీ సూచించాడు.

Updated Date - 2020-05-11T22:26:39+05:30 IST