ఘోర రోడ్డుప్రమాదం.. అమెరికన్ బిలియనీర్ కుమారుడు దుర్మరణం!

ABN , First Publish Date - 2020-12-19T19:16:36+05:30 IST

అమెరికాలోని కనెక్టికట్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బిలియనీర్ రే డాలియో కుమారుడు డెవాన్ డాలియో(42) దుర్మరణం చెందారు.

ఘోర రోడ్డుప్రమాదం.. అమెరికన్ బిలియనీర్ కుమారుడు దుర్మరణం!

కనెక్టికట్‌: అమెరికాలోని కనెక్టికట్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బిలియనీర్ రే డాలియో కుమారుడు డెవాన్ డాలియో(42) దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని రే డాలియో తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కనెక్టికట్‌‌లోని గ్రీన్‌విచ్‌లో ఈ ప్రమాదం జరిగింది. డెవాన్ డ్రైవ్ చేస్తున్న ఆడి కారు రోడ్డు పక్కన ఉన్న ఓ స్టోర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించడంతో డెవాన్ కారులోంచి బయటపడలేకపోయాడు. కారులోనే సజీవదహనం అయ్యాడు. ఇక రే డాలియో.. బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, కో-చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్. అతని నికర ఆస్తి విలువ సుమారు 15.5 బిలియన్ డాలర్లు. కుమారుడి మృతి పట్ల రే డాలియో విచారం వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబాన్ని డెవాన్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని డాలియో ట్వీట్ చేశారు.

Read more