ఎముకలు కొరికే చలిలో.. 10 గంటలపాటు.. 58ఏళ్ల వ్యక్తి!

ABN , First Publish Date - 2020-12-19T22:21:51+05:30 IST

ఎముకలు కొరికే చలిలో ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. తలచుకుంటేనే భయమేస్తోంది కదా. కానీ 58ఏళ్ల వ్యక్తి తాను కోరుకోకుండానే ఆ భయానక పరిస్థితిని ఎదు

ఎముకలు కొరికే చలిలో.. 10 గంటలపాటు.. 58ఏళ్ల వ్యక్తి!

వాషింగ్టన్: ఎముకలు కొరికే చలిలో ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. తలచుకుంటేనే భయమేస్తోంది కదా. కానీ 58ఏళ్ల వ్యక్తి తాను కోరుకోకుండానే ఆ భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌ను ప్రస్తుతం మంచు తుఫాను ముంచేస్తోంది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తుండంతోరోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోతోంది. ఈ క్రమంలో ఓ పని మీద కార్లో బయటికి వెళ్లిన న్యూయార్క్ చెందిన 58ఏళ్ల కెవిన్ క్రెసిన్.. ఒవెగో ప్రాంతంలో మంచు తుఫానులో చిక్కుకుపోయాడు. కారుపై నాలుగు ఫీట్లమేర మంచు పేరుకుపోవడంతో దాదాపు 10 గంటలపాటు అందులోనే ఉండిపోయి.. ఎముకలు కొరికే చలిలో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఎమెర్జెన్సీ నెంబర్‌ను పలుమార్లు సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచులో కూరుకుపోయిన కారును అతికష్టం మీద గుర్తించి.. అందులోంచి ఆయనను బయటకు తీసుకొచ్చారు. అనంతరం కెవిన్ క్రెసిన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. 


Read more