డిసెంబర్ నాటికి అమెరికాలో 2.82లక్షల కరోనా మరణాలు!
ABN , First Publish Date - 2020-11-14T02:06:45+05:30 IST
అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమెదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో దాదాపు 1.50లక్షల కేసులు నమోదయ్యాయి. సుమారు వెయ్యి మంది మహమ్మారి కా
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమెదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో దాదాపు 1.50లక్షల కేసులు నమోదయ్యాయి. సుమారు వెయ్యి మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో విపరీతంగా కరోనా కేసులు పెరగడంపట్ల ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య కోటీ 8లక్షలకు చేరింది. సుమారు 2.50 లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 5 నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 2.82లక్షలకు చేరుతుందని సెంట్రల్ ఫర్ డిసీస్ కంట్రోల్ అంచనా వేసింది.