దుబాయిలో మళ్లీ ప్రారంభమైన అమెర్ వీసా కేంద్రాలు
ABN , First Publish Date - 2020-04-26T19:35:26+05:30 IST
కరోనా ఆంక్షల నేపథ్యంలో దుబాయిలో మూతపడ్డ అమెర్ వీసా కేంద్రాలు తిరిగి ఆదివారం ప్రారంభమయ్యాయి.

దుబాయి: కరోనా ఆంక్షల నేపథ్యంలో దుబాయిలో మూతపడ్డ అమెర్ వీసా కేంద్రాలు తిరిగి ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కేంద్రాలు పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఇక దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అమెర్ కేంద్రాలకు వచ్చే జనాలు తప్పని సరిగా మాస్కులు ధరించి రావాలని అధికారులు సూచించారు. అలాగే ఈ కేంద్రాలకు వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించేందుకు థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. దుబాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసరిస్తున్న 30 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలనే నిబంధనను ఈ కేంద్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. 'కొవిడ్-19' రెసిస్టెన్స్ ప్రోటోకాల్‌ను నిర్వహించడంలో ఇది కూడా ఒక భాగం అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.