వ్యాక్సిన్‌ వివరాల చోరీ ఆరోపణలు సరికాదు

ABN , First Publish Date - 2020-07-20T14:14:46+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తస్కరించేందుకు తమ దేశ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని వస్తున్న ఆరోపణలు సరికాదని యూ

వ్యాక్సిన్‌ వివరాల చోరీ ఆరోపణలు సరికాదు

  • బ్రిటన్‌లోని రష్యా రాయబారి ఆండ్రీ కెలిన్‌


లండన్‌, జూలై 19: కరోనా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తస్కరించేందుకు తమ దేశ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని వస్తున్న ఆరోపణలు సరికాదని యూకేలోని రష్యా రాయబారి ఆండ్రీ కెలిన్‌ అన్నారు. రష్యా నిఘా వర్గానికి చెందిన వారిగా అనుమానిస్తున్న ఏపీటీ 29 బృంద హ్యాకర్లు దాడి చేస్తున్నారని ఇటీవల బ్రిటన్‌, అమెరికా, కెనడా చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అలాగే, యూకే ఎన్నికల్లోనూ రష్యా జోక్యం చేసుకుందంటూ వస్తున్న ఆరోపణలనూ కొట్టిపారేశారు.  


Updated Date - 2020-07-20T14:14:46+05:30 IST