తొమ్మిది మంది వైద్యులను కాల్చి చంపిన ఉగ్రవాదులు...
ABN , First Publish Date - 2020-05-29T20:38:54+05:30 IST
తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చిచంపిన ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది.

సోమాలియా: తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చిచంపిన దారుణ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్‌కు చెందిన తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొదట తొమ్మిది మంది డాక్టర్లను అపహరించుకెళ్లిన సౌత్ సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. అనంతరం వైద్యుల మృతదేహాలను మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. కాగా, వైద్యులందరూ యువకులేనని, స్థానిక ఆస్పత్రుల్లో పని చేస్తున్నజూనియర్ డాక్టర్లుగా అధికారులు పేర్కొన్నారు.