లండన్ నుంచి భారత్‌కు నాన్‌స్టాప్ విమానాలు: ఎయిరిండియా

ABN , First Publish Date - 2020-09-03T20:09:45+05:30 IST

లండన్ నుంచి ఇండియాలోని 10 నగరాలకు డైరెక్ట్(నాన్‌స్టాప్) విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది.

లండన్ నుంచి భారత్‌కు నాన్‌స్టాప్ విమానాలు: ఎయిరిండియా

న్యూఢిల్లీ: లండన్ నుంచి ఇండియాలోని 10 నగరాలకు డైరెక్ట్(నాన్‌స్టాప్) విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది. 'వందే భారత్ మిషన్'(వీబీఎం) కింద బ్రిటన్, భారత్ మధ్య నడవనున్న విమాన సర్వీసులకు ఇవి అదనం అని ఎయిరిండియా పేర్కొంది. కాగా, ఈ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి 24వ తేదీ మధ్య ఉంటాయని తెలిపింది. లండన్ నుంచి భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అమృత్‌సర్, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవా, కోల్‌కతాకు ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు పనిచేయనున్నాయి. అలాగే వీబీఎంలో భాగంగానే భారత్ నుంచి సింగపూర్‌కు సెప్టెంబర్ 4-24 తేదీల మధ్య అదనపు విమాన సర్వీసులు నడిపిస్తామని ఎయిరిండియా తెలియజేసింది.

ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం... 

ఢిల్లీ-బెంగళూరు-సింగపూర్

సింగపూర్-బెంగళూరు-ఢిల్లీ

ఢిల్లీ-చెన్నై-సింగపూర్

సింగపూర్-చెన్నై-ఢిల్లీ మార్గాలలో ఈ విమాన సర్వీసులు ఉంటాయి. 

వీటికి సంబంధించిన బుకింగ్స్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.     

Updated Date - 2020-09-03T20:09:45+05:30 IST