వందే భారత్ మిషన్: మాస్కో నుంచి ఢిల్లీకి చేరుకోనున్న 145 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-06-22T22:08:06+05:30 IST

రష్యాలో చిక్కుకున్న 145 మంది భారతీయులు మరి కొద్ది గంట్లలో భారత్‌కు

వందే భారత్ మిషన్: మాస్కో నుంచి ఢిల్లీకి చేరుకోనున్న 145 మంది భారతీయులు

మాస్కో: రష్యాలో చిక్కుకున్న 145 మంది భారతీయులు మరి కొద్ది గంట్లలో భారత్‌కు చేరుకోనున్నారు. ఆదివారం మాస్కో ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఏఐ 1924 విమానం ఢిల్లీ, ఘాయా ఎయిర్‌పోర్టులకు చేరుకోనుంది. వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మిషన్‌లో రెండు విడతలు పూర్తి కాగా.. ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోంది. కాగా.. ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న 2,50,087 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. మే 7వ తేదీన వందే భారత్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో రెండు విడతలు పూర్తికాగా.. జూన్ 10 నుంచి మూడో విడత ప్రారంభమైంది. జూన్ 30 వరకు మూడో విడతలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. మూడో విడతలో మొత్తంగా 550 విమనాలను నడుపుతున్నట్టు విదేశాంగశాఖ ప్రకటించింది. విమానాలే కాకుండా నౌకల ద్వారా కూడా కేంద్రం భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది.

Updated Date - 2020-06-22T22:08:06+05:30 IST