మరణాల సంఖ్యలో చైనాను దాటిన మరో దేశం..!
ABN , First Publish Date - 2020-03-26T01:41:17+05:30 IST
కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో ఇప్పటి వరకు 6,820 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ రోజు ఒక్క కేసు కూడా అక్కడ నమోదు కాలేదు.