ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో మౌనిక ప్రతిభ

ABN , First Publish Date - 2020-06-22T13:41:30+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం నిర్వహించిన ప్రపంచస్థాయి కవితల పోటీల్లో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతి

ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో మౌనిక ప్రతిభ

రాజ్‌భవన్‌ విద్యార్థినికి ‘తానా’ ప్రశంసాపత్రం


బేగంపేట, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం నిర్వహించిన ప్రపంచస్థాయి కవితల పోటీల్లో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ కనబర్చింది. ఇటీవల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ఘనుడు నాన్న- త్యాగధనుడు నాన్న’ అనే అంశంపై ప్రపంచ స్థాయి కవితల పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రకటన వచ్చింది.


రాజ్‌భవన్‌ పాఠశాలలో పదోతరగతి చదివిన మౌనిక ఈ పోటీల్లో పాల్గొన్నారు. తన కవితను ఆన్‌లైన్‌ ద్వారా వారికి పంపారు. నాన్నపై ఆమె పంపిన కవిత్వంలో విశేషమైన ప్రతిభాపాటవాలను కనబరచినందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహితీ విభాగం అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా మౌనికకు ప్రశంసాపత్రం పంపిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ, తెలుగు విభాగం అధ్యాపకులు శరత్‌బాబు తెలిపారు.  

Updated Date - 2020-06-22T13:41:30+05:30 IST