భారత వైద్య బృందానికి.. యూఏఈలో ఘనస్వాగతం!

ABN , First Publish Date - 2020-05-10T17:50:44+05:30 IST

కరోనా మహమ్మారిపై యూఏఈ చేస్తున్న యుద్ధానికి తనవంతు సాయంగా భారత ప్రభుత్వం 88 మంది వైద్య సిబ్బందిని పంపింది. 88 మంది వైద్య సిబ్బందితో బెంగళూరు

భారత వైద్య బృందానికి.. యూఏఈలో ఘనస్వాగతం!

యూఏఈ: కరోనా మహమ్మారిపై యూఏఈ చేస్తున్న యుద్ధానికి తనవంతు సాయంగా భారత ప్రభుత్వం 88 మంది వైద్య సిబ్బందిని పంపింది. 88 మంది వైద్య సిబ్బందితో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం.. దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. వైద్య సిబ్బందికి యూఏఈ అధికారులు ఎయిర్‌ పోర్ట్‌లో గులాబీ పూలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్, కాన్సుల్ జనరల్‌ ఆఫ్ ఇండియా విపుల్.. మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధాలకు ఇది నిదర్శనం అన్నారు. మహమ్మారిపై రెండు దేశాలు కలిసి కట్టుగా పోరాడుతాయని తెలిపారు. కాగా.. యూఏఈ చేరిన 88 మంది వైద్య సిబ్బంది రెండు వారాలపాటు క్వారెంటైన్‌లో ఉండనున్నారు. అనంతరం అక్కడి అవసరాలకు తగ్గట్లు వివిధ ఆసుపత్రుల్లో వారు సేవలు అందించనున్నారు. కాగా.. వైరస్‌పై యూఏఈ చేస్తున్న పోరుకు.. తనవంతు సాయంగా 88 మందితో కూడిన వైద్య బృందాన్ని పంపనున్నట్లు భారత ప్రభత్వం గతంలో ప్రకటించింది. ఇక ఈ మ‌హ‌మ్మారిపై పోరాడుతున్న కువైట్‌కు స‌హాయంగా ఇంత‌కుముందు భార‌త ప్ర‌భుత్వం 15 మంది స‌భ్యుల వైద్య బృందాన్ని పంపించిన విష‌యం తెలిసిందే. యూఏఈలో ఇప్పటి వరకు 17వేల మంది కరోనా బారినపడగా.. 185 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-05-10T17:50:44+05:30 IST